Hindi Syllabus: 9,10 తరగతులకు హిందీ సిలబస్ లో మార్పు! 1 y ago
రాబోయే విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ సిలబస్‌లలో మార్పులు తీసుకొస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మినహాయించిన పాఠ్యాంశాలను తొలగించి, పుస్తకాలు ముద్రించనుంది. ప్రస్తుతం ఉన్న ఎన్సీఈఆర్టీ హిందీ సిలబస్ ను తొమ్మిది, పది తరగతుల్లో తొలగించి, గతంలో రాష్ట్ర సిలబస్ లోని హిందీ పుస్తకాలను తిరిగి ప్రవేశపెట్టనున్నారు. హిందీ సబ్జెక్టు సిలబస్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 6,7,8 తరగతుల్లో హిందీ సబ్జెక్టులో ప్రస్తుతం రాష్ట్ర సిలబస్‌ని అమలు చేస్తోంది.